జాతీయ స్థాయిలో వర్షాల కోసం ప్రార్ధనలు చెయ్యాలని యూఏఈ ప్రెసిడెంట్‌ పిలుపు

- December 15, 2020 , by Maagulf
జాతీయ స్థాయిలో వర్షాల కోసం ప్రార్ధనలు చెయ్యాలని యూఏఈ ప్రెసిడెంట్‌ పిలుపు

యూఏఈ‌: ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, వర్షాల కోసం ఈ శుక్రవారం ప్రార్థనలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. 'సలాత్‌ అల్‌ ఇస్తికా' పేరుతో అరబ్‌లో పిలిచే ప్రేయర్స్‌ పలు మసీదులు, ముసల్లాహ్‌లలో డిసెంబర్‌ 18న నిర్వహిస్తారు. శుక్రవారం ప్రార్థనలకు 10 నిమిషాల ముందు ఈ ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించడం జరుగుతుంది. డిసెంబర్‌ 4 నుంచి మసీదులను ప్రారంభించగా, కరోనా నేపథ్యంలో తగిన ప్రికాషన్స్‌ తీసుకోవాల్సిందిగా స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనలకు సైతం ప్రత్యేక సూచనలు కరోనా నేపథ్యంలో పాటించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com