ఖతార్ లో మరో వరల్డ్ కప్ స్టేడియం ప్రారంభానికి సిద్ధం

- December 15, 2020 , by Maagulf
ఖతార్ లో మరో వరల్డ్ కప్ స్టేడియం ప్రారంభానికి సిద్ధం

దోహా:ఖతార్ లో నాలుగో వరల్డ్ కప్ స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. వీఐపీలు, అభిమానులు, ఆటగాళ్ల నడుమ మరో మూడ్రోజుల్లో అల్ రయ్యాన్ లోని ఫిఫా వరల్డ్ కప్ స్డేడియాన్ని ప్రారంభించబోతున్నారు. 2022 వరల్డ్ కప్ ఈ స్డేడియం వేదిక కానుంది. అంతేకాదు...ఖతార్ జాతీయ దినోత్సవం రోజున ప్రారంభం కానున్న ఈ స్టేడియంలో రిబ్బన్ కట్ అయిన కొద్ది గంటల్లోనే అమీర్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండటం విశేషం. మొత్తం 40 వేల మంది కెపాసిటీ కలిగిన స్టేడియం నిర్మాణంలో మరో ప్రత్యేకత ఏటంటే...దీని నిర్మాణంలో 90 శాతం పాత స్టేడియంలోని మెటీరియల్ నే వినియోగించి పనులు పూర్తి చేశారు. ఫుట్ బాల్ లవర్స్ ఎక్కువగా ఉండే ఖతార్ లో  స్టేడియం ప్రారంభాన్ని హిస్టారిక్ డేగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఓపెనింగ్ రోజున మ్యాచ్ కు మూడు గంటల ముందు నుంచే గ్రాండ్ గా కల్చరల్ ప్రొగ్రామ్స్ నిర్వహించనున్నారు. అయితే..కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ మార్గనిర్దేశకాల మేరకు ప్రారంభోత్సవంతో పాటు..ఫైనల్ మ్యాచ్ నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టేడియం కెపాసిటిలో సగం మందిని మాత్రమే అనుమతించనున్నారు. 

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com