యువతరానికి భగవద్గీత చదవడం నేర్పించాలి-టి.గవర్నర్
- December 17, 2020
హైదరాబాద్:యువతరానికి భగవద్గీత చదవడం నేర్పించాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భగవద్గీత చదవడాన్ని ఒక అలవాటుగా మార్చితే జీవితంలో ఎంతో ఉన్నత స్ధితికి చేరడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. గీతాపారాయనం ద్వారా జీవితంలో ఏది సాధించాలన్నా ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, రక రకాల సమస్యలను అధిగమించడానికి ఉపయోగ పడుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సాంస్కృతిక భరతి, ప్రజ్ఞాభారతి, ఇంపాక్ట్ ఫౌండేషన్ సయుక్తంగా నిర్వహించిన గీతా జ్ఞాన సప్తాహాన్ని గవర్నర్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవద్గీత ద్వారా ఎందరో మహానుభావులు మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద వంటి వారు స్పూర్తి పొందారని అన్నారు. ప్రపంచంలోనే వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఉత్తమైన గ్రంధమని చెప్పారు. మానవులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించే గ్రంధమని తెలిపారు.చేసే పనిలో అంకితభావం, క్రమశిక్షణ నేర్పించే గ్రంధమని అన్నారు, భగవద్గీత పారాయణం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు రుజువు చేశాయని గవర్నర్ పేర్కొన్నారు.

తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







