మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ
- December 17, 2020
తిరుమల:వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈసారి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే వైకుంఠ ఏకాదశికి రోజుకు 20వేల చొప్పున టికెట్లను జారీ చేసినట్టు ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు.
తిరుపతిలో ఉన్న స్థానికుల కోసం ఐదు కౌంటర్లలో టికెట్లను ఇస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్న నేతలకు కుటుంబసభ్యులతో కలిపి ఐదుగురిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపారు. పదవుల్లో లేని వీఐపీలకు మాత్రం వన్ ప్లస్ త్రీగా అనుమతి ఉంటుందని అన్నారు.
సిఫార్సు లేఖలు ఇవ్వొద్దని ఈవో జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వైకుంట ఏకాదశి దర్శనాల్లో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాల్లో టికెట్ లేకుండా ఎవరినీ అనుమతించమన్నారు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి. కోవిడ్ కారణంగా రోజుకు కేవలం 35వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఏకాదశి పర్వదినాల్లో సిఫార్సు లేఖలు చెల్లవన్న ధర్మారెడ్డి.. అలాంటి వారిని అలిపిరి దగ్గరే ఆపేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







