దుబాయ్-ఢిల్లీ ఇండిగో విమానంలో సీటు కింద బంగారం పట్టివేత
- December 19, 2020
న్యూ ఢిల్లీ:దుబాయ్ నుంచి ఢిల్లీకి చేరిన ఇండిగో విమానంలో ఓ సీటు కింద దాచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సకనుగొన్నారు. రూ.49.9 లక్షల విలువైన 1.13 కేజీల ఈ బంగారం సిలిండ్రికల్ రాడ్స్ రూపంలో ఉంది. విమానంలోని సీటు ట్రాక్ గార్డ్స్ లో ఎవరికీ కనబడకుండా నేర్పుగా దీన్ని దాచారు.ఈ ప్లేన్ శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కస్టమ్స్ చట్టం కింద అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు దీన్ని ఇలా దాచారన్నది తెలియలేదు.ఒక విమానంలో ని సీటు కిందా పుత్తడి దాచిన ఘటన ఇదే మొదటిదని అంటున్నారు.ఢిల్లీ కస్టమ్స్ అధికారులు దీనిపై దుబాయ్ విమాన సిబ్బందితో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇటీవలి కాలంలో దుబాయ్ నుంచి భారత్ లోకి బంగారం దొంగ రవాణా ఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు కస్టమ్స్ అధికారుల నిఘా కారణంగా ఈ స్మగ్లింగ్ కి అడ్డుకట్ట వేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









