టీవీ చూస్తూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ..
- February 20, 2016
టీవీ చూస్తూ ఆహారం తింటే లావై పోతారని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా అదే పనిగా టీవీ చూస్తూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని, ఒబేసిటీ కి దారి తీస్తుందని అంటున్నారు. ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ, వాటిలో లీనమై పోవడం వల్లో, ఫేస్ బుక్ లో బిజీ అయిపోవడం వల్లో తాము ఎంత తింటున్నామనే విషయాన్ని మరచిపోతారట..ఇది హెల్త్ కి ఏమాత్రం మంచిది కాదని సెలవిస్తున్నారు. అమెరికాలో రీసెర్చర్లు సుమారు 60 కుటుంబాలను స్టడీ చేశారు.టెలివిజన్ల ముందు కూర్చుని ఫుడ్ లాగిస్తున్న వారిని, మామూలుగా డైనింగ్ హాల్లో తింటున్న వారిని అధ్యయనం చేశారు. వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ను, ప్రవర్తనను, కమ్యూనికేషన్ ను స్టడీ చేయగా ఈ విషయం బయట పడింది.టీవీల ముందు కూచున్న పేరెంట్స్ తమ పిల్లలు ఎంత తింటున్నారో పర్యవేక్షించ లేకపోయారని తేలింది. వాళ్ళ ఎమోషన్స్ ని, బిహేవియర్ ని కూడా పసిగట్టలేకపోయారట. దీనివల్ల స్థూల కాయం పెరుగుతుంది సుమా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యంగా పేరెంట్స్ తమ పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







