నాగార్జున కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో...
- February 20, 2016
తన తదుపరి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్నట్టు ప్రముఖ కథానాయకుడు నాగార్జున తెలిపారు. శ్రీవెంకటేశ్వరస్వామి చరిత్రకి సంబంధించిన ఆ చిత్రంలో హథీరాం బాబా పాత్రలో నటిస్తున్నానని చెప్పారు. 'సోగ్గాడే చిన్నినాయనా' విజయాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. ''కొత్త పాత్రల్లో నటించవచ్చని, కొత్త ప్రతిభని ప్రోత్సహించవచ్చని మరోసారి నాలో నమ్మకాన్ని పెంచిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. దర్శకుడు కల్యాణ్‌కృష్ణ చాలా కష్టపడ్డాడు. 'సోగ్గాడే.
.'కి కొనసాగింపుగా 'బంగార్రాజు' పేరుతో మరో చిత్రం చేయబోతున్నాం. త్వరలోనే 'వూపిరి'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ఆ సినిమా కోసం తమిళంలో నేను సొంతంగా డబ్బింగ్ చెబుతున్నా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 18వ శతాబ్దం నేపథ్యంలో సాగుతుంది. ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఆ చిత్రం ఏప్రిల్- మేలో ప్రారంభమవుతుంది. వీటితో పాటు దిల్‌రాజు ఓ కథ వినమని చెప్పారు. వీలు చూసుకొని వింటా. నచ్చితే తప్పకుండా చేస్తా'' అన్నారు. 'సోగ్గాడే చిన్నినాయనా' దర్శకుడు కల్యాణ్‌కృష్ణ అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే తదుపరి చిత్రాలు చేయబోతున్నాడని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం 'ప్రేమమ్' తర్వాత నాగచైతన్య కల్యాణ్ దర్శకత్వంలోనే నటిస్తాడని చెప్పారు నాగ్. కార్యక్రమంలో కల్యాణ్‌కృష్ణ, అనూప్‌రూబెన్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







