ఉచిత శిక్షణ శిబిరం..
- February 20, 2016
మా కళా ఆర్ట్స్ క్రియేషన్స్ ఆఫ్ ఫౌండేషన్ కల్చరల్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో పలు కళాశాలలో యువ కళాకారులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాపాక సూర్య ప్రకాశ్‌రావు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడి, భరత నాట్యం, డ్యాన్స్, కథ, రచన, రంగస్థల, నటన, గేయం, గానం, డబ్బింగ్, డైలాగ్స్, దర్శకత్వం, జానపదం మొదలగు అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణలో పాల్గొనే వారి వయసుతో సంబంధం లేదన్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తా మన్నారు. 20 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, ఈ శిక్షణలో రాణించిన వారికి కళాకారులుగా గుర్తింపు కార్డులు, సర్ట్టిఫికెట్స్, రూ.1500 రుసుము ఇస్తామన్నారు. ఆసక్తిగల కళాకారులు 8978394315, 8978426315 నెంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







