ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
- December 31, 2020
హైదరాబాద్:ప్రముఖ తెలుగు చిత్ర నటుడు నర్సింగ్ యాదవ్(52) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన..సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆయన గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ముఖ్యంగా ఆయన విలన్, కామెడీ విలన్ వేశాలు వేశారు. అన్ని భాషల్లో కలిపి ఆయన 300 పైగా చిత్రాల్లో నటించారు. హేమాహేమీలు సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. నర్సింగ్ యాదవ్ స్వస్థలం హైదరాబాద్. క్షణక్షణం, ముఠామేస్త్రి, శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్, గాయం, కిల్లర్, మాస్, మాయలోడు, ఫ్యామిలీ సర్కస్, టెంపర్, రేసుగుర్రం, పిల్ల జమిందార్, అన్నవరం, సైనికుడు వంటివి ఉన్నాయి. నర్సింగ్ యాదవ్‌కు భార్య చిత్ర యాదవ్, తనయుడు రుత్విక్ యాదవ్ ఉన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు