సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం

- December 31, 2020 , by Maagulf
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం
హైదరాబాద్:సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఈరోజు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ... కోవిడ్ సమయంలో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేయడంలో సైబరాబాద్ పోలీసులుయ ముందున్నారన్నారు. అలాగే వరదల సమయంలోనూ ట్రాఫిక్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ముందుగా ట్రాఫిక్ పోలీసులే ప్లాస్మా ను డొనేట్ చేశారన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు విధుల్లో అలసత్వం వహించరాదన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. అవినీతి, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించకుంటే ఉపేక్షించేది లేదన్నారు. మంచి ఆహారం తినాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఇమ్యూనిటీ ని పెంచుకోవాలన్నారు. 
 
  అనంతరం డిసిపి ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... సాయంత్రం 6 నుంచి రాత్రి 12 వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కువగా 25 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ విషయమై ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదల నివారణకు వివిధ శాఖల సమన్వయం తో పటిష్ట ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ఈ ఏడాది ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యల్లో భాగంగా మియాపూర్ లో 40 % ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. హెల్మెట్ వాడకం, సీట్ బెల్టు ధరించడం, చలికాలంలో మంచు కారణంగా జరిగే ప్రమాదాలు ఇలా వివిధ విషయాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ సంవత్సరం సైబరాబాద్ లో మొత్తంగా 27 % రోడ్డు ప్రమాదాలు తగ్గాయన్నారు. వచ్చే సంవత్సరం 30 % తగ్గాలన్నారు. ఇందుకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు కోవిడ్ నిబంధనలు, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మాస్కూలు, గ్లోవ్స్, శానిటైజర్ లు తప్పనిసరిగా ధరించాలన్నారు. 
కార్యక్రమం చివరలో ఉత్తమ పనితీరు కనబర్చిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సీపీ  రివార్డులు అందజేశారు. 
 
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్, డిసిపి ట్రాఫిక్ ఎస్ఎమ్ విజయ్ కుమార్, ఐపిఎస్., మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ క్వార్టర్స్ ట్రాఫిక్ ఏసీపీ సంతోష్ కుమార్, ట్రాఫిక్ అడ్మిన్ ఇన్ స్పెక్టర్ వాసు, ఈ-చలాన్ ఎస్ఐ శశికాంత్ రెడ్డి అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఇన్ స్పెక్టర్లు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com