తాను పండించిన కూరగాయలను దుబాయ్ పంపనున్న MS ధోని...

- January 02, 2021 , by Maagulf
తాను పండించిన కూరగాయలను దుబాయ్ పంపనున్న MS ధోని...

ఝార్ఖండ్:టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న తర్వాత వ్యవసాయం ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాను  పండించిన ఆ కూరగాయలను దుబాయ్ కి పంపనున్నాడు ధోని. తన ఫామ్ హౌస్‌లో పండించిన కూరగాయలను దుబాయ్‌కు పంపించడానికి సన్నాహాలు కూడా చివరి దశలో ఉన్నాయి. దుబాయ్‌కు కూరగాయలు పంపే ఏజెన్సీని కూడా ఎంపిక చేశారు. అయితే ధోని కూరగాయలను విదేశాలకు పంపే బాధ్యతను జార్ఖండ్ వ్యవసాయ శాఖ తీసుకుంది. ''ఆల్ సీజన్ ఫార్మ్ ఫెష్ ఏజెన్సీ'' ధోని కూరగాయలను దుబాయ్‌లో విక్రయించనుంది. అయితే ఇదే ఏజెన్సీ ద్వారా జార్ఖండ్ వ్యవసాయ శాఖ గల్ఫ్ దేశాలకు కూరగాయలను పంపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు కోసం ప్రభుత్వం పనిచేస్తోందని మార్కెటింగ్ కమిటీ అధిపతి అభిషేక్ ఆనంద్ తెలియజేశారు. ధోని ఒక బ్రాండ్... కాబట్టి అతని పేరుతో  కూరగాయలను పంపిస్తే... ఇక్కడి రైతులు కూడా లాభం పొందుతారు. ఇన్ని రోజులు ఇక్కడికి రావటానికి ఇష్టపడని ఏజెన్సీలు కూడా ఇప్పుడు ఇక్కడకు వస్తాయని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com