'చెక్' సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్!!
- January 03, 2021
హైదరాబాద్:ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ఇందులోకథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి గ్లిమ్స్ని ఆదివారం విడుదల చేశారు . "జైలు లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు" అనే వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆదిత్యను విశ్వనాధన్ ఆనంద్ , కాస్పరోవ్ తో ఒకరు పోలిస్తే, ‘అతను పచ్చి తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి’ అని పోలీస్ ఆఫీసర్ దూషిస్తాడు. 'HE IS INNOCENT' అని లేడీ అడ్వకేట్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ గ్లింప్స్, సినిమాలోని ఆసక్తికరమైన కోణాలని ఆవిష్కరించింది.
ఈ సందర్బంగా నిర్మాత వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "నితిన్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలకు ఏ మాత్రం తగ్గదు ఈ సినిమా. ఈచిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యింది . ప్రస్తుతం రీ - రికార్డింగ్ జరుగుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ‘ఐతే ‘ చిత్రం తర్వాతచంద్రశేఖర్ యేలేటి - కళ్యాణి మాలిక్
కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా ఇదే. ఔట్ పుట్ అద్భుతంగా వచ్చింది. రిలీజ్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అని తెలిపారు.
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ- ''చదరంగం నేపథ్యంలో సాగే ఓ ఉరిశిక్షపడ్డ ఖైదీ కథ ఇది '' అని చెప్పారు.
నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరితదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం : కళ్యాణి మాలిక్, ఛాయా గ్రహణం : రాహుల్ శ్రీవాత్సవ్ , ఆర్ట్ : వివేక్ అన్నామలై , ఎడిటింగ్ : అనల్ అనిరుద్దన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి , నిర్మాత : వి.ఆనంద ప్రసాద్,
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్‌ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









