10K రన్‌ను ప్రారంభించిన సీపీ మహేశ్ భగవత్
- January 03, 2021
హైదరాబాద్: ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఎస్ఎంఎస్‌ను జీవితంలో భాగంగా చేసుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. ఎస్ఎంఎస్ అంటే శానిటైజర్ (ఎస్), మాస్క్ (ఎం), సోషల్ డిస్టెన్స్ (ఎస్) అని చెప్పారు. కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ హెచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో జరిగిన 10K రన్‌ను సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని చెప్పారు. అయితే మళ్లీ కొత్తగా కేసులు వస్తున్నాయని వెల్లడించారు.
పోలీసు సిబ్బందిలో 1058 మందికి కరోనా వచ్చిందని, అందరూ కోలుకున్నారని తెలిపారు. హెచ్ ఫౌండేషన్ వాళ్లు ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు.లాక్‌డౌన్ సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పోలీసు సిబ్బందికి కూడా మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారని అభినందించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ సభ్యులు, పోలీసులు భారీగా తరలివచ్చారు. దీంతో ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్‌ను మల్లించారు.



తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







