ఒమన్:2020లో 47 వేల చిన్న,మధ్య తరహా పరిశ్రమలు నమోదు
- January 03, 2021
మస్కట్:గత ఏడాదిలో నవంబర్ మాసాంతానికి ఒమన్ చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధి విభాగంలో మొత్తం 47,802 చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రిజిస్టర్ అయినట్లు జాతీయ గణాంకాలు, సమాచార కేంద్రం వెల్లడించింది. 2019తో పోలిస్తే ఇది 13.4 శాతం ఎక్కువని వివరించింది. కింగ్డమ్ పరిధిలోని మిగిలిన గవర్నరేట్ లతో పోలిస్తే మస్కట్ ఈ గణాంకాల్లో టాప్ పొజిషన్ లో ఉంది. మొత్తం ఎస్ఎంఈలలో మస్కట్ గవర్నరేట్ లో సెప్టెంబర్ చివరి నాటికి 33 శాతం(16,024) నమోదయ్యాయి. నార్త్ అల్ బాటినాలో 16 శాతం(7,536), అల్ ధఖిలియాలో 13 శాతం(6,040), దోఫర్ లో 8 శాతం (3,979) నమోదవగా మిగిలిన గవర్నరేట్ల పరిధిలో 30 శాతం ఎస్ఎంఈలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు







