సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- January 04, 2021
హైదరాబాద్:సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటినుండి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సంస్థ అభివృద్ధితోపాటు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు పలు వినతులను ప్రస్తావించగా, సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆరెపల్లి రాజేందర్, రాజేశ్వర్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







