కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదం దేశానికే గర్వకారణం:టి.గవర్నర్

- January 04, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ ఆమోదం దేశానికే గర్వకారణం:టి.గవర్నర్

హైదరాబాద్‌ : కరోనా వ్యాక్సిన్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలపడం దేశం గర్వించదగ్గ విషయమని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర మెడికల్‌ కళాశాల 7 రోజులపాటు నిర్వహించనున్న పాథాలజీ వార్షిక ర్యాపిడ్‌ రిప్యూ కోర్సు (ఎస్‌పీఏఆర్ఆర్‌సీ-2021)ను సోమవారం ఆమె వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించి మాట్లాడారు. వ్యాక్సిన్‌ తయారీ, అభివృద్ధిలో భారత్‌ చొరవను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తు చేశారు.

వ్యాక్సిన్‌ను WHO ఆమోదించడం మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న చాలాదేశాలు భారత్‌ తయారు చేసిన టీకా కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు.

భారత పరిశోధనపై విమర్శలకు టీకా అభివృద్ధితో మన శాస్త్రవేత్తలు సమాధానం చెప్పారని అన్నారు. ప్రధాని మోడీ దూరదృష్టితో పరిశోధన సంస్థలకు ఆర్థిక ఊతం ఇచ్చి శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపడంతోనే వ్యాక్సిన్‌ తయారీ సాధ్యమైందని గవర్నర్‌ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com