కాజ్‌వే ద్వారా బహ్రెయిన్‌లోకి వచ్చేవారికి కొత్త గైడ్‌లైన్స్
- January 04, 2021
మనామా:కింగ్ ఫవాద్ కాజ్‌వే అథారిటీ, కొత్త హెల్త్ గైడ్‌లైన్స్‌ని బ్రహెయిన్ పౌరులు అలాగే, అనుమతి పొందిన ప్రయాణీకులు కింగ్‌డమ్‌లోకి ప్రవేశించేందుకోసం విడుదల చేయడం జరిగింది. ప్రయాణీకులు తమతోపాటు పీసీఆర్ టెస్ట్ రిజల్ట్‌ని తీసుకురావాల్సి వుంటుంది. 72 గంటల ముందుగా చేసిన టెస్టుని మాత్రమే అనుమతిస్తారు. బహ్రెయిన్ అలాగే సౌదీ అరేబియా అ్రకెడెటెడ్ ల్యాబోరేటరీ నుంచి పొందిన సర్టిఫికెట్‌ని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అధికారిక ప్రభుత్వ మిషన్, పారిన్ మినిస్ట్రీ వ్యక్తులు, అఫీషియల్ మిషన్స్ వారి కుటుంబ సభ్యులు వంటి వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నారు. క్లనికల్ ట్రయల్స్ పార్టిసిపెంట్లు, ఆరేళ్ళ లోపు చిన్నారులకు కూడా వెసులుబాట్లు కల్పించనున్నారు. బివేర్ బహ్రెయిన్ యాప్ ద్వారా పొందిన పరీక్ష ఫలితం, సౌదీ అరేబియాకి చెందిన యాప్ ద్వారా వచ్చే ఫలితం కూడా అనుమతిస్తారు. ముందస్తు పరీక్ష చేసుకోనివారికి మాత్రం కింగ్ ఫవాద్ కాజ్‌వే వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్ట్ సెంటర్స్‌లో పరీక్షలు చేయించుకోవాల్సి వుంటుంది. పది రోజుల్లోగా వారు తిరిగి వెళ్ళకపోతే, పదవ రోజున మళ్ళీ పరీక్ష చేయించుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనల్ని, ప్రికాషన్స్‌ని పాటించక తప్పదు. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి తప్పనిసరి.
తాజా వార్తలు
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…







