పేరుపాలెం సౌత్ లో అభివృద్ధి పనులకు చిరంజీవి భూమిపూజ
- February 22, 2016
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిధిలోని పేరుపాలెం సౌత్లో రూ.5కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సోమవారం భూమిపూజ చేశారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో భాగంగా చిరంజీవి మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సౌత్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సర్పంచి సోమిశెట్టి రంగనాథ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో చిరంజీవి మాట్లాడుతూ.. పేరుపాలెం సౌత్ గ్రామం అభివృద్ధికి దూరంగా ఉండడంతో దత్తత తీసుకున్నానని చెప్పారు. భవిష్యత్లో మరికొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటానని తెలిపారు. గ్రామంలో నూతన జూనియర్ కళాశాల, పీహెచ్సీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







