కువైట్: వ్యాక్సిన్ల మధ్య ఎంపిక లేదు
- January 09, 2021
కువైట్:కోవిడ్ వ్యాక్సిన్ పై కువైట్ లో ఊహించిన పరిణామాలే ఎదురవుతున్నాయి. అత్యవసరంగా అనుమతులు పొందిన ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ను కువైట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత రెండు వారాలుగా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగిస్తోంది. అయితే..స్వచ్ఛదంగా ముందుకు వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తోంది. కానీ, ఫైజర్ వ్యాక్సిన్ డ్రైవ్ పట్ల కువైట్ ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించటం లేదు. ఫైజర్ వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఇంకా అనుమానాలు ఉన్నాయని...అందుకే వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆశించిన స్థాయిలో జనం ముందుకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. పైగా త్వరలోనే 30 లక్షల ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ డోసులు వస్తాయనే అంచనాలతో కువైటీయన్లలో చాలామంది ఆక్స్ ఫర్డ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుత పరిణామాలపై కలగజేసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు...ప్రజలు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తీసుకోవటం ఉత్తతమని స్పష్టత ఇచ్చింది. ఫైజర్, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ అంటూ ఆప్షన్ ఎంచుకునే అవకాశాలు లేవని కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 1.50 లక్షల ఫైజర్ డోసులు అందుబాటులో ఉన్నాయని, ప్రధాన్య వర్గాలతో పాటు పౌరులు, ప్రవాసీయులు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చని వెల్లడించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన వెబ్ సైట్ ద్వారా ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







