గ్రీన్ దేశాల జాబితాలో ఖతార్, ఒమన్..అప్ డేటెడ్ లిస్ట్ ప్రకటించిన అబుధాబి
- January 12, 2021
అబుధాబి:అబుధాబి గ్రీన్ కంట్రీస్ లిస్టులో మరో రెండు దేశాలు అప్ డేట్ అయ్యాయి. ఒమన్, ఖతార్ ను కూడా గ్రీన్ దేశాల జాబితాలో చేర్చినట్లు ప్రటించింది. దీంతో గ్రీన్ లిస్ట్ దేశాలు, ప్రాంతాలు, భూభాగాల సంఖ్య 17కి పెరిగింది. గ్రీన్ లిస్టులో ఉన్న దేశాలు, భూభాగాల నుంచి అబుధాబికి చేరుకునే వారికి క్వారంటైన్ నిబంధనలు వర్తించవు. అంటే ఆయా దేశాల నుంచి అబుధాబి చేరుకునే వారు...ప్రయాణానికి 96 గంటల లోపు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని ఉండాలి. పీసీఆర్ టెస్ట్ లో కోవిడ్ 19 నెగటివ్ గా ఉంటే వారు తాము కోరుకున్న గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అయితే..ఎయిర్ పోర్టులో మాత్రం మరోసారి పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తారు. పాజిటివ్ వస్తే సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాల్సి ఉంటుంది. బ్రూనై, చైనా, హాంగ్ కొంగ, ఇస్లే ఆఫ్ మ్యాన్, కువైట్, మకావో, మౌరిషియస్, మొంగోలియా, కొత్త కాలెడోనియా, న్యూజిలాండ్, ఒమన్, కతార్, సావో టోమ్ మరియు ప్రిన్సిపీ, సౌదీ అరేబియా, స్టట్ కిట్స్- నెవిస్, తైపీ, థాయ్ దేశాలను గ్రీన్ లిస్ట్ జాబితాలో చేర్చింది అబుధాబి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







