కువైట్ వెలుపల ఉన్న 33,414 మంది కార్మికుల పర్మిట్లు రద్దు
- January 12, 2021
కువైట్ సిటీ:కువైట్ లో వర్క్ పర్మిట్ కలిగి ఉండి..కొంత కాలంగా విదేశాల్లో ఉంటున్న కార్మికుల పర్మిట్లను రద్దు చేస్తున్నట్లు మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాళ్లంతా ఏడాది అంతకు మించి కువైట్లో ఉండటం లేదని స్పష్టం చేసింది. మొత్తం 33,414 వర్క్ పర్మిట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే..వర్క్ పర్మట్ల రద్దు విషయంలో రెసిడెన్సీ అనుమతుల గడువును ప్రమాణికంగా తీసుకున్నట్లు పౌర సంబంధాల అధికార విభాగం స్పష్టం చేసింది. రెసిడెన్సీ అనుమతి గడువు ముగిసి ఇతర దేశాల్లో ఉంటున్న కార్మికుల పర్మిట్లను మాత్రమే రద్దు చేసినట్లు వివరించింది. దీంతో రద్దైన పర్మిట్ల సంఖ్య 91,854కి చేరిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







