లేబర్ చట్టానికి కీలక మార్పులు చేయనున్న సౌదీ
- January 12, 2021
సౌదీ అరేబియాలో ఉద్యోగాల కల్పన పేరుతో లైసెన్సు లేకుండా ఉద్యోగార్థులని ట్రాప్ చేయడాన్ని నేర పూరిత చర్యగా మార్చడంతోపాటు, కఠినంగా అలాంటివారిని శిక్షించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు. ఈ మేరకు కొత్త రూల్‌ని రూపొందిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 200,000 సౌదీ రియాల్స్ నుంచి 500,000 సౌదీ రియాల్స్ వరకు జరీమానా విధించేలా చట్టంలో మార్పలు తీసుకువస్తారు. వర్కింగ్ విమెన్ కోసం 14 వారాల మెటర్నిటీ లీవ్ (పూర్తి వేతనంతో) అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. రీ-ఎంట్రీ వీసా ఫీజుని వలసదారులే చెల్లించేలా కూడా మార్పులు చేయనున్నారు. నాన్ సౌదీ వర్కర్స్ రిక్రూట్‌మెంట్ రుసుము, రెసిడెన్సీ పర్మిట్ రుసుములను ఎంప్లాయర్ చెల్లించాల్సి వుంటుంది. స్త్రీ పురుష బేధభావం, రంగు, డిజేబిలిటీ, వివాహితులా.? కాదా.? అన్న అంశాల ప్రాతిపదికన ఎలాంటి వివక్ష కూడా చూపించకుండా ఎంప్లాయర్ కార్మికుల పట్ల వ్యవహరించాల్సి వుంటుంది. కార్మికులకు వసతి సౌకర్యం కల్పించేలా కూడా చట్టంలో మార్పులు చేయనున్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







