గల్ఫ్ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా-బి.వినోద్ కుమార్

- January 12, 2021 , by Maagulf
గల్ఫ్ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా-బి.వినోద్ కుమార్

హైదరాబాద్:జీవనోపాధి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల సమస్యల పరిష్కారం, వారి సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. మంగళవారం గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు.వినోద్ కుమార్ నివాసంలో జరిగిన సమావేశంలో గల్ఫ్ కార్మికులకు సంబంధించిన గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డ్ అతి త్వరగా  ఏర్పర్చాలని వివరిస్తూ బోయినపల్లి వినోద్ కుమార్ ని కలిసి సుదీర్ఘంగా చర్చిండం జరిగింది.బడ్జెట్ తో కూడిన బోర్డు ఏర్పాటు చెయ్యాలని , దాంట్లో ముఖ్యం గా చనిపోయిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తూ , సురక్షిత వలసలకు , విదేశాల్లో వివిధ కారణాలతో ఇరుక్కున్న వారిని రప్పించడం , తిరిగి వచ్చిన వారికి ఉపాధి , వైద్య విద్య హామీలు, భిమాల మీద , నైపుణ్యత మీద దృష్టి పెట్టాలని, మోసాలను అరికట్టి వారికి కఠిన శిక్షలు జరిమానాలు విధించాలని తెలుపగా బోయినపల్లి  వినోద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన వారి సమస్యలు తనకు క్షుణ్ణంగా తెలుసన్నారు.

ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీ ఇచ్చారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు కోటపాటి నరసింహం నాయుడు, మంద భీం రెడ్డి, ఏముల రమేష్, జంగం బాలకిషన్, జనగామ శ్రీనివాస్,  కుంట దశాగౌడ్, గంగుల మురళీధర్ రెడ్డి, కుంట దశగౌడ్ తదితరులు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com