సౌదీ అరేబియా టీసీఎస్‌లో GE వాటా టీసీఎస్ వశం
- January 12, 2021
రియాద్:భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా, సౌదీ అరేబియాలోని టీసీఎస్ యూనిట్‌లో జీఈ వాటాను కైవసం చేసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. టీసీఎస్ సౌదీ అరేబియాలో జీఈ వాటా విలువ సుమారు 12,471 $ (రూ.9.13 లక్షలు) ఉంటుంది. 2013 సెప్టెంబర్‌లో జీఈ భాగస్వామ్యంతో సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో పూర్తిగా మహిళలతో బిజినెస్ ప్రాసెస్ సర్వీసెస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
తాజాగా ఈ యూనిట్ నుంచి వైదొలగాలని జీఈ ప్రణాళిక రూపొందించుకున్నదని, భాగస్వాములు టీసీఎస్‌లోని జీఈ వెంచర్ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేశాయని నియంత్రణ సంస్థల వద్ద దాఖలు చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. వాటాల బదిలీ పూర్తయితే రియాద్‌లోని ప్రాసెసింగ్ యూనిట్‌కు సంబంధించి పూర్తి బాధ్యతలు టీసీఎస్ నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపింది.
జనరల్ ఎలక్ట్రిక్ ఇంటర్నేషనల్ (బెనెలక్స్) బీవీ) అనుబంధ సంస్థ సౌదీ డసర్ట్ రోజ్ హోల్డింగ్ బీవీకి, టీసీఎస్ సౌదీ అరేబియాలో 24 శాతం వాటా ఉంది. మిగతా 76 శాతం వాటా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నెదర్లాండ్స్ బీవీకి ఉంది. ఈ కేంద్రంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు గత ఏడేండ్లలో 20 మంది నుంచి వెయ్యి మందికి చేరుకున్నది.
రెస్పాన్సిబుల్ కాంపిటీటివ్ నెస్ కు గాను కింగ్ ఖాలీద్ అవార్డ్స్ 2018, బెస్ట్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ లీడర్ సిప్ ప్రోగ్రామ్ అమలు చేసినందుకు 2018 ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ప్లేస్ అవార్డ్స్‌తో సహా పలు అవార్డులను టీసీఎస్ సౌదీ అరేబియా అందుకున్నది. ఈ వాటాల బదిలీ కోసం సౌదీ అరేబియాలో యాంటీ ట్రస్ట్ సంస్థ ఆమోదం కోసం టీసీఎస్ దరఖాస్తు చేసింది. మూడు నుంచి ఆరు నెలల్లో దీనికి ఆమోదం లభించవచ్చునని భావిస్తున్నారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







