యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్ ముఖ్యమైన సూచన
- February 23, 2016
పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పీఐవో) కార్డుపై భారతకు వెళ్లాలనుకునే యూఏఈ ఎన్నారైలకు ఇక్కడి భారత కాన్సులేట్ ఓ ముఖ్యమైన సూచన చేసింది. మార్చి 31 తర్వాత ఈ కార్డులు చెల్లుబాటు కావని, ఆలోగా ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డుకు బదిలీ చేసుకోవాలని తెలిపింది. ఆఖరి నిముషంలో హడావుడి పడకుండా ప్రవాసీయులు ముందుగా వచ్చి కాన్సులేట్ కార్యాలయంలో బదిలీ దరఖాస్తు చేసుకోవాలని కాన్సుల్ (వీసా) రాహుల్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా భారత నుంచి ఓసీఐ కార్డు రావడానికి రెండు నెలలు పడుతుందని, కానీ తాము నెల రోజుల్లోనే కార్డు తెప్పించి ప్రవాసులకు అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మార్చి 31లోగా ఓసీఐ కార్డు పొందకపోతే భారతకు వెళ్లడం కోసం వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టంచేశారు. అంతేకాదు... 1,020 దిర్హాంల దరఖాస్తు రుసుం చెల్లించి ఓసీఐ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







