టెర్రర్ 26న
- February 23, 2016
అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై సతీష్‌కాశెట్టి దర్శకత్వంలో శ్రీకాంత్, నిఖిత జంటగా షేక్ మస్తాన్ రూపొందించిన చిత్రం 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 26న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను శనివారం ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ముందుగా నరేష్ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ చిత్రం గురించే తాము మాట్లాడుకున్నామని, తప్పక విజయవంతవౌతుందని తెలిపారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ నేరేషన్ విధానం నచ్చి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్‌గా నీట్‌గా వండర్‌ఫుల్‌గా దర్శకత్వం వహించారని, సాయికార్తీక రీరికార్డింగ్ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని కథానాయకుడు శ్రీకాంత్ అన్నారు.కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి దర్శకుడు ఎంత కష్టపడ్డాడో శ్రీకాంత్‌తో సహా మిగతా టెక్నీషియన్లు అందరూ అంతగా సపోర్ట్ చేశారని, అందుకే ఇంత బాగా చిత్రం వచ్చిందని నిర్మాత షేక్‌మస్తాన్ తెలిపారు. సినిమా తీయడం సులభమే అయినా విడుదల చేయడం సులభం కాదని ఈ చిత్రంతో తెలిసిందని, ఈ సినిమా మంచి విజయం సాధించాలని వారు కోరుకుంటున్నట్లుగా దర్శకుడు సతీష్ కాశెట్టి అన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







