'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగ్ ప్రారంభం...

- February 23, 2016 , by Maagulf
'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగ్ ప్రారంభం...

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీమూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న 'జనతా గ్యారేజ్‌' షూటింగ్‌ కార్యక్రమాలు సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో వేసిన భారీ సెట్‌లో ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్‌ సరసన సమంత, నిత్యామీనన్‌ నటిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ,'ఎన్టీఆర్‌ నటనకి, ఆయనకున్న మాస్‌ ఇమేజ్‌కి సరిపడే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. చాలా పెద్ద స్పాన్‌ ఉన్న హైలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ను నేనెలా చూడాలనుకుంటున్నానో, అటువంటి క్యార్టెకర్‌ని ఈ చిత్రం కోసం తీర్చిదిద్దాను. ఆగస్ట్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశాం' అని చెప్పారు.
'మా బ్యానర్‌లో రెండో చిత్రంగా ఎన్టీఆర్‌తో చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్‌లో తొలి చిత్రంగా 'శ్రీమంతుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన దర్శకుడు కొరటాల శివగారితో మళ్ళీ పని చేయడం విశేషంగా భావిస్తున్నాం. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాం. హైదరాబాద్‌, చెన్నై, ముంబైలతోపాటు కేరళలో షూటింగ్‌ జరుపుకునే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది' అని నిర్మాతలు చెప్పారు. మోహన్‌లాల్‌ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈచిత్రంలో సాయికుమార్‌, ఉన్ని ముకుందన్‌, అజరు, బ్రహ్మాజీ, బెనర్జీ, జాన్‌, గుణాజీ, సితార, దేవయాని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : తిరు, ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌ : ఏ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌ : ఆణల అరసు, సంగీతం : దేవీశ్రీ ప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు : నవీన్‌ యెర్నేవి, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎం), రచన- దర్శకత్వం : కొరటాల శివ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com