విజయ్ సేతుపతి న్యూలుక్..

విజయ్ సేతుపతి న్యూలుక్..

చెన్నై:విజయ్ సేతుపతి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న స్టార్ నటుడు. తనదైన నటనతో అందరిలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వివిధ పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా నిలిచాడు. ఈ విలక్షణ నటుడు నేడు పుట్టిన రోజు సందర్భంగా ఉప్పెనా సినిమా టీం విజయ్ పోస్టర్‌ను విడుదల చేసింది. విజయ్ మొదటగా పిజ్జా సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి మెప్పించాడు. మళ్లీ ఇన్నాళ్ళకు ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు. మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కానున్న సినిమా ఉప్పెన. సముద్ర తీరంలో ఉండే ఓ గ్రామంలో పేద యువకుడికి పెద్దింటి అమ్మాయికి మధ్య జరిగే రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గంభీరమైన పాత్రలో విజయ్ కనపించనున్నాడు. గ్రామ పెద్ద రాయనంగా విజయ్ చేస్తున్నాడు. అయితే తాజాగా విడుదలైన ఉప్పెనా కొత్త పోస్టర్‌లో విజయ్ చాలా టెర్రిఫిక్ లుక్స్‌తో కినిపిస్తున్నాడు. ఖద్దరు చోక్కా, పంచె చేతిలో కళ్ళద్దాలు పట్టుకొని ఎంతో సీరియస్‌ లుక్‌తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ద్వార ఉప్పెన టీం విజయ్‌కి పుట్టిన రోజు విషెస్ చెప్పింది. ఈ సినిమాను ఎట్టకేలకు వచ్చె నెల మొదటి వారంలో విడుదల చేసేందుకు చిత్ర టీం ప్రయత్నిస్తోంది.

Back to Top