డిపిఎస్‌-ఎంఐఎస్‌ స్టూడెంట్స్‌తో సానియా మీర్జా

- February 23, 2016 , by Maagulf
డిపిఎస్‌-ఎంఐఎస్‌ స్టూడెంట్స్‌తో సానియా మీర్జా

ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా డిపిఎస్‌ మోడర్న్‌ ఇండియన్‌ స్కూల్‌ (ఎంఐఎస్‌) స్టూడెంట్స్‌తో మమేకమయ్యారు. ఈ సందర్భంగా, క్రీడల పట్ల చిన్నప్పటినుంచే ఆసక్తి పెంచుకోవాలని, తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వాలు పిల్లల్లోని క్రీడల పట్ల ఆసక్తిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. క్రీడల్ని ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలనుకునేవారు, విద్యలో కూడా ముందుండేందుకు ప్రయత్నించాలని అన్నారు సానియా మీర్జా. 'నేను చదువుకున్న స్కూలు నాకు చాలా నేర్పించింది. తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు అందించిన ప్రోత్సాహమే ఇప్పుడు నేఇలా ఉండటానికి కారణం' అని సానియా మీర్జా చెప్పింది. కతార్‌ టెన్నిస్‌ ఫౌండేషన్‌తో కలిసి డిపిఎస్‌-ఎంఐఎస్‌ సానియా మీర్జాతో విద్యార్థుల కలయికకు ఏర్పాట్లు చేసింది. టెన్నిస్‌ తర్వాత క్రికెట్‌ అంటే ఇష్టమనీ, అందుకే క్రికెటర్‌ని పెళ్లాడానని సాయినా వెల్లడించింది. ఖతార్‌ టోటల్‌ ఓపెన్‌లో సానియా మీర్జా స్విస్‌ లెజెండ్‌ మార్టినా హింగిస్‌తో కలిసి డబుల్స్‌ ఆడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com