'బాబు బంగారం' జూన్ 1న
- February 23, 2016
'గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో నటిస్తున్న వెంకటేష్, ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. డైరెక్టర్ మారుతి మంచి ఫాంలో ఉండటం కూడా సినిమాకు బాగా కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.'భలే భలే మొగాడివోయ్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి, వెంకటేష్ తో మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బాబు బంగారం సినిమాను పక్కాగా రెడీ చేస్తున్నాడు.మేకింగ్ తో పాటు రిలీజ్ విషయంలో కూడా ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎలాంటి పోటీ లేకుండా జూన్ 1న సోలోగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.వెంకటేష్ సరసన హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార నటిస్తున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత. మారుతి దర్శకత్వం వహిస్తుండగా, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ కామెడీ పోలీస్ గా నటించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







