ఆసుపత్రి నుండి శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే..

- January 31, 2021 , by Maagulf
ఆసుపత్రి నుండి  శశికళ డిశ్చార్జ్: మరికొన్ని రోజులు బెంగుళూరులోనే..

బెంగుళూరు: ఎఐడీఎంకె మాజీ నేత శశికళ బెంగుళూరులోని ఆసుపత్రి నుండి ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో జైలు నుండి ఆసుపత్రిలో చేరిన శశికళ ఇవాళ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.

బెంగుళూరు నుండి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న సమయంలోనే ఆమె జైలు నుండి విడుదలయ్యారు. ఆసుపత్రిలోనే ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలు అధికారులు పూర్తి చేశారు.

ఆమె ఆరోగ్యంగా ఉన్నందున ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు శనివారం నాడు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన కరోనాతో ఆమె ఆసుపత్రిలో చేరారు. అక్రమాస్తుల కేసులో శశికళను ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 1600 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. మరో పది రోజుల పాటు  బెంగుళూరులోనే శశికళ ఉండే అవకాశం ఉందని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com