దుబాయ్ గ్లోబల్ విలేజ్ పై కోవిడ్ ఎఫెక్ట్...షోలు, ఫైర్ వర్క్స్ రద్దు
- February 04, 2021
దుబాయ్:ధూమ్ ధామ్ గా జరగాల్సిన్ దుబాయ్ గ్లోబల్ విలేజ్ పై కోవిడ్ ఎఫెక్ట్ పడింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పలు ఆంక్షలు విధిస్తున్న దుబాయ్ ఆరోగ్య శాఖ గ్లోబల్ విలేజ్ లోని ఈవెంట్లకు కూడా పరిమితి విధించింది. గ్లోబల్ విలేజ్ లో షోలు, స్ట్రీట్ ఎంటర్టైన్మెంట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అలాగే వీకెండ్ లో నిర్వహించే ఫైర్ వర్క్స్ ను కూడా పూర్తిగా రద్దు చేసింది. ఫిబ్రవరి 3 నుంచి తదుపరి నోటీసులు అమల్లోకి వచ్చే వరకు ఈ కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయి. అయితే..మిగిలిన ఈవెంట్లు భౌతిక దూరం పాటిస్తూ యథావిధిగా కొనసాగనున్నాయి. సీటింగ్ డిస్టెన్స్ తో స్పీడింగ్ స్టంట్ ను యథావిధిగా కొనసాగిస్తారు. అన్ని ఆరోగ్య భద్రత ప్రమాణాలతో ప్రపంచశ్రేణిలో గ్లోబల్ విలేజ్ ఏర్పాట్లు ఉన్నాయని, సందర్శకులు ఓపెన్ ఎయిర్ షాపింగ్, డైనింగ్, రైడింగ్ ను ఎంజాయ్ చేయవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఇదిలాఉంటే కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఇండోర్ ఈవెంట్లు, సినిమా, స్పోర్ట్స్ ఈవెంట్లను 50 శాతం సామర్ధ్యంతో నిర్వహించొచ్చని..అలాగే రెస్టారెంట్లు, కేఫ్ లు 70 శాతం సామర్ధ్యంతో నిర్వహించొచ్చని దుబాయ్ ఆరోగ్య శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







