జాంబిరెడ్డి రివ్యూ!
- February 05, 2021చిత్రం : జాంబిరెడ్డి విడుదల తేదీ : ఫిబ్రవరి 05, 2021 నటీనటులు : తేజ సజ్జా, ఆనందీ, దక్ష నగర్కర్, రఘు బాబు, గెటప్ శ్రీను, హర్షవర్ధన్, హేమంత్, హరి తేజ. దర్శకత్వం : ప్రశాంత్ వర్మ నిర్మాతలు : రాజ్ శేఖర్ వర్మ సంగీతం : మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ : అనిత్ ఎడిటింగ్ : సాయి బాబు ప్రశాంత్ వర్మ తొలి చిత్రం 'అ' తోనే తన వైవిధ్యాన్ని చూపించాడు. కల్కి తో మరోసారి స్టైలిష్ మేకింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈసారి తెలుగు తెరకు జాంబిలను తెచ్చాడు.. హాలీవుడ్ లో మెప్పించిన ఈ జాంబీలు తెలుగులో ఎలాంటి ఎంటర్ టైన్మెంట్ అందించారో చూద్దాం..
కథ : మ్యారియో (తేజా సజ్జా) ఒక గేమ్ డిజైనర్ .. తన టీంతో కలసి ఒక గేమ్ ని డిజైన్ చేస్తాడు.. అందులో ఒక ప్రాబ్లమ్ వస్తుంది.. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే టీం మెంబర్ పెళ్ళి చేసుకోవడానికి కర్నూల్ వెళతాడు.. ఆ టీం మెంబర్ కోసం మ్యారియో మిగిలిన టీం తో కర్నూల్ వెళతాడు.. వెళ్ళే దారిలో మ్యారియో ఫ్రెండ్ జాంబీ వైరస్ కి ఎక్కుతుంది.. అది మెల్లగా ఆ ఊరంతా వస్తుంది.. ఎదుట మనిషిని కొరికి రక్తం తాగాలనిపించే ఆ వ్యాది బారిన ఊరంతా పడుతుంది.. మరి మ్యారియో తన టీంతో ఊరినుండి ఎలా బయటపడతాడు..? అక్కడ అతనికి ఎదరైన మరో సమస్య ఏంటి అనేది మిగిలిన కథ..?
సినిమా మొదలైన దగ్గర నుండి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రిలాక్స్ అవలేదు.. తేజ కర్నూల్ ఎంటరయిన దగ్గర నుండి కథ మరింత వినోదంగా మారింది.. సీమ మూర్ఖత్వాలను. అక్కడ పగలను చాలా సటైరికల్ గా మార్చాడు ప్రశాంత్ వర్మ.. హరితేజ నీలాంబరి క్యారెక్టర్ నుండి ప్రతి పాత్ర కూడా సరదాగానే సాగుతుంది.. ఎంచుకున్న నేపథ్యం కొత్తది అవడంతో కొత్త సన్నివేశాలకు అవకాశం దొరికింది. అన్నపూర్ణమ్మ తో గెటప్ సీన్ చేసిన కామెడీ చాలా సరదాగా ఉంది.. గెటప్ శ్రీను కు మంచి బ్రేక్ వచ్చిందనిపించింది. దక్ష స్ర్కీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. ఇంకా సినిమా మర్క్ కె రాబిన్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.. జాంబి ల సినిమా అయినా అందులో కొన్ని ఎమోషన్స్ ని పండించాడు.. స్నేహితుడ్ని చంపాల్సి వచ్చినప్పుడు.. ఆనందిని కాపాడే సన్నివేశంలో కొన్ని ఎమోషన్స్ పండాయి..సరదాగా సాగే కథా కథనాలతో కొత్త కాన్సెప్ట్ ని బాగా మోల్డ్ చేసాడు దర్శకుడు.. సరదాగా సాగే కథనం.. అక్కడక్కడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో జాంబిరెడ్డి ఆకట్టుకున్నాడు.. చివరిగా: హార్రర్ కామెడీ రోటీన్ అయిన ప్రేక్షకులకు జాంబిరెడ్డి కొత్తగా అనిపిస్తాడు.. జాంబి జానర్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడంలో జాంబిరెడ్డి సక్సెస్ అయ్యాడు..
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన