ఏ.పీ:ఎస్సై శిరీషకు డీజీపీ సెల్యూట్!
- February 05, 2021
అమరావతి:శ్రీకాకుళం జిల్లాలో మానవత్వం చాటుకున్న మహిళా ఎస్ఐకి అరుదైన గుర్తింపు లభించింది. గుర్తుతెలియని శవాన్ని మోసి దనహ సంస్కారాలు నిర్వహించిన ఎస్సై శిరీష గురించి పోలీసు శాఖ మొత్తం చర్చించుకుంటోంది. ఆమె సేవలకు గుర్తుగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా సత్కరించారు. ఎస్సై శిరీషను చూడగానే ఆమెకు డీజీపీ సెల్యూట్ చేశారు. అనంతరం బ్యాడ్జ్‌తోపాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

ఎస్సై శిరీషకు డీజీపీ సెల్యూట్‌కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అడవికొత్తూరు గ్రామంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ శిరీష.. డెడ్ బాడీని స్వయంగా కిలోమీటర్ దూరం వరకు మోసుకొచ్చారు.లలితా చారిటబుల్ ట్రస్టు వారి సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు. మహిళా ఎస్‌ఐ అనాథ శవాన్ని మోసి, దహన సంస్కారాలు నిర్వహించడంతో స్థానికులతోపాటు డిపార్ట్‌మెంట్ అధికారులు అభినందించారు. అయితే స్థానికులను, తోటి సిబ్బందిని ఇబ్బంది పెట్టకూడదనే తాను ఆశవాన్ని మోసుకొచ్చినట్లు ఎస్‌ఐ శిరీష తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







