ఫేస్ బుక్ ఫేక్ ఖాతాను తీసేయొచ్చు

- February 05, 2021 , by Maagulf
ఫేస్ బుక్ ఫేక్ ఖాతాను తీసేయొచ్చు

హైదరాబాద్:ఫేస్‌బుక్‌లో ఎవరైనా మన పేరుతో నకిలీ అకౌంట్‌ను సృష్టిస్తే.. దానిని డిలీట్‌ చేసే ఆప్షన్‌ను కల్పించారు.ఇటీవలి కాలంలో సైబర్‌ నేరగాళ్లు మన పేర నకిలీ అకౌంట్లు సృష్టిస్తూ.. అందులో ‘నాకు అత్యవసర పరిస్థితి ఏర్పడింది.ఆరోగ్య అవసరాల కోసం డబ్బు కావాలి. ఫలానా బ్యాంక్‌ ఖాతాకు పంపండి’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్ట్‌ను చూసిన స్నేహితులు, బంధువులు.. ‘మన వాడు నేరుగా అడగడానికి మొహమాటపడి ఫేస్‌బుక్‌ ద్వారా అడుగుతున్నాడు’ అని భావించి డబ్బులు పంపుతున్నారు.ఈ విషయాన్ని మనం గ్రహించేలోపే జరుగాల్సిన మోసం జరిగిపోతుంది. ఇటువంటి మోసాలను అరికట్టేందుకు మన పేరిట సృష్టించిన ఫేక్‌ అకౌంట్‌ను తొలగించే అవకాశాన్ని ఫేస్‌బుక్‌ కల్పించింది. 

మిత్రుల అప్రమత్తం 
మీ అసలు ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వివరాలను తెలియజేయడం ద్వారా మన బంధువులు, మిత్రులను అప్రమత్తం చేయవచ్చని రాచకొండ సైబర్‌ క్రైం ఏసీపీ హరినాథ్‌ తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ పేరు మీద ఓ నకిలీ ఖాతాను సృష్టించారు.ఈ ఖాతాలో సైబర్‌ నేరగాడు ‘నమస్కార్‌ జీ’ అని పెట్టాడు. ఈ ఖాతాను పరిశీలించిన ఏసీపీ స్నేహితుడు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన ఏసీపీ శివకుమార్‌.. విషయాన్ని ఫేస్‌బుక్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వారు సూచించిన విధంగా ఆ నకిలీ ఖాతా ఐడీలో 20 మందితో డిలీట్‌ పోస్టు అని పెట్టించారు.

నకిలీ ఖాతాను తొలిగించండిలా..

  • ఆ నకిలీ ఖాతాలో పైన కుడివైపు మూడు చుక్కలు ఉంటాయి.
  • దానిపై క్లిక్‌చేస్తే రిపోర్టు ఆప్షన్‌ వస్తుంది. 
  • అందులో దాదాపు 20 మంది ‘ఈ పోస్టును డిలీట్‌ చేయండి’ అని పెట్టాలి.
  • వెంటనే ఫేసుబుక్‌ ఆ ఖాతాను తొలగించేస్తుంది. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com