ప్యాసెంజర్ అలర్ట్: దుబాయ్‌లో కొత్త టెర్మినల్
- February 25, 2016
దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభమయ్యింది. 75 మిలియన్ల మందికి వీలుగా ఇప్పటికరకు అందుబాటులో ఉన్న టెర్మినల్‌కి అదనంగా కొత్త టెర్మినల్ సేవలందిస్తుంది. దీంతో 90 మిలియన్ల మందికి సేవలు అందించగలుగుతుంది. కొత్త టెర్మినల్‌లో బ్రిటిష్ ఎయిర్వేస్కి చెందిన ఫ్లైట్ 105కి స్వాగతం పలుకుతున్నారు. కొన్ని నెలలుగా ఈ టెర్మినల్‌లో అనేక పరీక్షలు నిర్వహించారు. ఈ నెల మొదటి వారంలో 2000 మందితో ట్రయల్ నిర్వహించడం జరిగింది. ఈ ఏడాదిలో 85 మిలియన్ల మందికి దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం సేవలందిస్తుందని దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సీఈఓ పాల్ గ్రిఫిత్స్ వెల్లడించారు. దీంట్లోని కాంకోర్స్ డి ద్వారా దుబాయ్ ఇంటర్నేషనల్ మరింత ప్రముఖమైనదిగా ఖ్యాతిగాంచనుంది. ఒకేసారి 300 మందిని ఈ కాంకోర్స్ డి చేరవేస్తుంది. కాంకోర్స్ డీలోని దుబాయ్ డ్యూటీ ఫ్రీ వెండర్స్ 175 వరకు ఉంటారు. 8000 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం రిటెయిల్ ప్లేస్ 33,000 చదరపు మీటర్లు. ఫ్యాషన్ విభాగం 1000 చదరపు మీటర్లలోనూ, లిక్కర్ మరియు ఫుడ్ విభాగం 1000 చదరపు మీటర్ల మేర విస్తరించాయి. కాంకోర్స్ డీ 21 కాంటాక్ట్స్ స్టాండ్స్‌ని కలిగి ఉంది. వీటిల్లోని నాలుగు విభాగాలు ఎయిర్‌బస్ ఎ380 లేదా బోయింగ్ 748లను ఎకామడేట్ చేయగలవు. 11 రిమోట్ స్టాండ్స్ 18 మిలియన్ ప్యాసింజర్ల కెపాసిటీతో రూపొందాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







