రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు

- February 25, 2016 , by Maagulf
రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు

: కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు గురువారం మధ్యాహ్నం 12గంటలకు లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ ప్రజల ఆకాంక్షలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ సిద్ధం చేశామని సురేశ్‌ప్రభు వివరించారు. ప్రస్తుతం రైల్వే శాఖ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్లకు భయపడబోమని ధైర్యంగా ఎదుర్కొంటామని పేర్కొంటూ ఆయన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మాటల్ని ఉదహరించారు. కష్టాలు వస్తూనే ఉంటాయి... ముందుకు సాగుతూనే ఉంటాం... అని ప్రభు అన్నారు. మన ప్రయాణంలో మార్పునకు ఈ బడ్జెట్‌ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు.దేశంలోని మిలియన్ల కొద్దీ సామాన్యులను తాకుతూ ఈ ప్రయాణం ఉంటుందన్నారు.రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు * రాబడి పెంపుదల కోసం సంప్రదాయ ఆలోచనా విధానాలు వదిలి కొత్తగా ఆలోచిస్తున్నాం * చార్జీలు పెంచితేనే ఆదాయం అనే విధంగా కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నాం * ప్రతి ఒక్క అవకాశం ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందేలా చర్యలు * ఇంధన సేకరణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలిగాం * డీజిల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఈ ఏడాది కూడా భారీగా ఆదా చేయాలని లక్ష్యం. * 2008-14 నుంచి 8శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు * గతేడాది అంతకు రెండు రెట్లు ఎక్కువ వృద్ధి సాధించాం * లక్షా 21వేల కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్‌ * భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. * సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే ముందంజ వేయాల్సి ఉంది. * భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత వినియోగించుకుంటున్నాం. రూపాయి ఖర్చుతో ఐదు రూపాయల వృద్ధి * గతేడాది బడ్జెట్‌లో ప్రకటించిన 139 అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం * వచ్చే ఐదేళ్లలో రూ.1.5లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్‌ఐసీ అంగీకరించింది. * రోజుకు 7 కి.మీ. రైల్వే లైన్ల నిర్మాణం * రూపాయి ఖర్చుతో రూ.5 వృద్ధి సాధించేలా చర్యలు * 2017-18లో 9వేల ఉద్యోగాల కల్పన * వచ్చే ఏడాది 2వేల కి.మీ. రైల్వే మార్గాలను విద్యుదీకరిస్తాం. ఆదాయ లక్ష్యం రూ. 1,84,820కోట్లు 2016-17 సంవత్సరానికి రైల్వేలు 1,84,820 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయని రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు. డీజిల్‌, విద్యుత్తు, ఇతర ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెడతామన్నారు. 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయూలు * 5,300 కి.మీ. 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయూలు * అంతర్గత ఆడిట్‌ విభాగాన్ని బలోపేతం చేసి, లీకేజీలు అరికట్టేందుకు కృషి * సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే ముందంజ వేయాల్సి ఉంది * ఈ ఏడాది మరో 100కు పైగా రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌కీపింగ్‌ సేవలు * 2015-16లో ఇంధన ఆదాతో రూ.8,720కోట్లు మిగిలాయి. * ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అందుబాటులోకి డిస్పోజబుల్‌ బెడ్‌షీట్లు * కొత్తగా 74 రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌ కీపింగ్‌ సేవలు రైల్వే 2020 లక్ష్యాలు * ఆన్‌డిమాండ్‌పై రైల్వే రిజర్వేషన్లు అందించడం. * రవాణా రైల్వే టైంటేబుల్‌ను కచ్చితంగా అమలయ్యేలా చూడడం. * అత్యున్నత సాంకేతికతతో భద్రతను మెరుగుపర్చడం. * కాపలాలేని రైల్వేగేట్లు ఉండకూడదు. * సమయపాలనను కచ్చితంగా అమలు చేయడం. * రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచడం, మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం 80 కిలోమీటర్లకు పెంచడం. * స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను నడపడం. * మానవ వ్యర్థాలను నేరుగా బయటకు పంపడాన్ని అరికట్టడం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com