సైన్స్ అండ్ నాలెడ్స్ ఆయుధాలు: ప్రిన్స్ ఖలీఫా
- February 25, 2016
దేశంలోని యువత సైన్స్ అండ్ నాలెడ్జ్ అనే ఆయుధాలను కలిగి ఉండడం దేశానికి మంచిదని ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ కలీఫా చెప్పారు.అల్ అహిలా యూనివర్సిటీ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రిన్స్ ఖలీఫా ఈ వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలు మరియు హై ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ అభివృద్ధి పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. దేశంలోని యూనివర్సిటీలపై అచంచలమైన విశ్వాసం తమకుందని ఆయన అన్నారు. విద్య అత్యవసరమైన విషయంగా తాము భావిస్తున్నామనీ, ఇదే విషయమై ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపడ్తున్నట్లు ప్రిన్స్ ఖలీఫా తెలియజేశారు. అల్ అహిలా యూనివర్సిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ అబ్దుల్లా యూసుఫ్ అల్ హవాస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటి ఫేజ్‌లో ఈ యూనివర్సిటీ 5000 మందికి, రెండో ఫేస్ పూర్తయ్యాక 10,000 మంది విద్యార్థులకు అకామడేట్ చెయ్యనుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







