దుబాయ్ బస్‌స్టాప్‌లో ఉచిత వైఫై
- February 25, 2016
జెమైరాలో తొలి స్మార్ట్ ఎయిర్ కండిషన్డ్ షెల్టర్‌ని బస్సు ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్ షెల్టర్‌ని డైరెక్టర్ జనరల్, ఛైర్మన్ ఆఫ్‌ది బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మట్టర్ అల్ తాయెర్ ప్రారంభించారు. దుబాయ్‌లోని 15 డిస్ట్రిక్ట్స్‌లో నిర్మించనున్న 100 స్మార్ట్ షెల్టర్స్‌లో ఇది మొదటిది. స్మార్ట్ షెల్టర్స్‌లో అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణీకులకు నఅందుబాటులో ఉంటాయి. 'డు' సంస్థ ఉచిత వైఫై సౌకర్యాన్ని కల్పించింది. ఎన్‌ఓఎల్ టాప్ అప్ కార్డ్స్, లోకల్, ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ కోసం టాప్ అప్ మొబైల్ ఫోన్స్, పబ్లిక్ మరియు ప్రైవేట్ ఎంటైటిల్స్‌కి సంబంధఙంచిన బిల్లుల చెల్లింపు, మొబైల్ ఫోన్ రీఛార్జింగ్, స్మార్ట్ కియోస్క్, మీడియా మరియు అడ్వర్టయిజింగ్ స్క్రీన్స్, ఆర్‌టీఏ సర్వీసులకు సంబంధించిన సమాచార ప్రదర్శన, స్నాక్స్ మరియు రిఫ్రెష్‌మెంట్స్ లభించే మినీ మార్ట్ ఇందులో ఏర్పాటయ్యాయి. ఫిబ్రవరి పూర్తయ్యేనాటికి 25 స్మార్ట్ షెల్టర్స్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు. మిగిలిన 75 షెల్టర్స్ మార్చ్ నెలాఖరుకు పూర్తి చేస్తారు. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకుని స్మార్ట్ షెల్టర్స్ కోసం బస్ స్టాప్స్‌ని ఎంపిక చేశారు. షేక్ జాయెద్ రోడ్, అల్ వస్ల్, జుమైరా, డీరా, ఉమ్ అల్ రోమూల్, అల్ కోజ్, అల్ రషిదియా, అల్ ఖాసైస్, అల్ అవిర్, అల్ నహదా, అల్ సత్వా, అల్ కరమా, అల్ రస్, అల్ గరహౌడ్, అల్ జుఫిలియా తదితర ప్రాంతాల్లో ఈ స్మార్ట్ బస్ షెల్టర్స్‌ని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







