వ్యాట్ ఇంప్లిమెంటేషన్ ఖరారు
- February 25, 2016
యూఏఈ అధికారికంగా వ్యాట్ ఇంప్లిమెంటేషన్ డేట్‌ని అనౌన్స్ చేసింది. అలాగే ఐదు శాతం వ్యాట్ వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. జీసీసీ సుప్రీం కౌన్సిల్ తీర్మానం ప్రకారం యూఏఈలో వ్యాట్‌ని జనవరి 1, 2018 నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లు యూఏఈ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ ఒబైద్ హమాద్ అల్ తయెర్ చెప్పారు. జీసీసీలో కొన్ని దేశాలు 2018 జనవరి 1 నుంచి, ఇంకొన్ని దేశాలు 2019 జనవరి 1 నుంచి వ్యాట్‌ని అమల్లోకి తీసుకువచ్చే అవకాశముందని ఆయన వెల్లడించారు. చాలా దేశాలు 2018 నుంచి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వివరించారు. వ్యాట్ రేటు 3 నుంచి 5 శాతం ఉండొచ్చని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. దాన్ని 5 శాతంగా ఇప్పుడు ఖరారు చేశారు. వ్యాట్ రెవెన్యూస్ 10 బిలియన్ దిర్హామ్‌ల నుంచి 12 బిలియన్ దిర్హామ్‌ల వరకు ఉండొచ్చని ఓ అంచనా. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ సహా కొన్ని ఫుడ్ ఐటమ్స్‌కు వ్యాట్ నుంచి మినహాయింపు ఉండొచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







