ఉప్పెన మూవీ రివ్యూ

- February 12, 2021 , by Maagulf
ఉప్పెన మూవీ రివ్యూ

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయమయ్యారు.అదే మెగా మేనల్లుడైన వైష్ణవ్‌తేజ్‌ 'ఉప్పెన' సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాపై ముందునుంచే భారీ అంచనాలే నెలకొన్నాయి.ప్రేమకథాంశంతోపాటు, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం కానీ, విజరుసేతుపతి నటనతో...ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయ్యింది.మరి ఇంత బజ్‌ క్రియేట్‌ చేసిన సినిమా ఫిబ్రవరి 12న శుక్రవారం విడుదలైంది.ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా..!

కథ: కాకినాడ, ఉప్పాడ గ్రామానికి చెందిన ఆశి (వైష్ణవ్‌తేజ్‌).మత్స్యకార కుటుంబానికి చెందిన ఓ పేదింటి కుర్రాడు. తండ్రి చేపల వ్యాపారానికి సహాయంగా ఉంటాడు.ఇక ఆ గ్రామంలో వ్యాపారవేత్త అయిన రాయణం (విజరుసేతుపతి) పరువును ప్రాణంగా భావించే వ్యక్తి. ఆయన అక్కడొక మార్కెట్‌యార్డు కట్టాలనీ లక్ష్యంగా పెట్టుకుంటాడు. దానికి సంబంధించీ ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌యార్డు కోసం అక్కడ నివాసముంటున్న జనాన్ని ఖాళీ చేయించాలనే ప్రయత్నాలు చేసినా జనం ఒప్పుకోరు. ఈ క్రమంలో ఎక్కడ కూతురు సంగీత అలియాస్‌ బేబమ్మ (కృతిశెట్టి) ప్రేమలో పడుతుందోనని.. వుమెన్స్‌ కాలేజీలో జాయిన్‌ చేయించి మరీ చదివిస్తుంటాడు. బేబమ్మను ఆశి చిన్నప్పటి నుంచే దొంగచాటుగా ప్రేమిస్తూ ఉంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో బేబమ్మ కూడా.. ఆశిని చూసి ప్రేమించడం మొదలుపెడుతుంది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం కాస్త తండ్రికి తెలుస్తుంది. వారి ప్రేమను తండ్రి ఒప్పుకోడని తెలిసి ఆశి, బేబమ్మ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. మరలా ఓ కారణం వల్ల.. కూతురిని తండ్రికి అప్పగిస్తాడు ఆశీ. అసలు ఏ కారణం వల్ల.. బేబమ్మను రాయణంకు అప్పగిస్తాడు? పరువునే ప్రాణంగా భావించే తండ్రి.. మరి కూతురి ప్రేమను అంగీకరిస్తాడా.. వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:పేద, ధనిక అంతరాల మధ్య సాగే చిత్రాలు ఏవైనా సరే.. ప్రేక్షకులు స్వీకరిస్తారు. పాతతరం సినిమాలనే వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందులోనూ యూత్‌ఫుల్‌ లవ్‌డ్రామాతో సాగే మూవీ అయితే ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అటువంటి కోవకి చెందిందే ఉప్పెన సినిమా.అలాగే హీరో, హీరోయిన్లు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి తొలిసినిమానే అయినా.. ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. దీంతో సినిమా ఆద్యంతం ఆసక్తిగా ఉంటుంది. అదీగాక దర్శకుడు బుచ్చిబాబు స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుడిని కట్టిపడేశాడు. ఇక తండ్రిగా విజరుసేతుపతి నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది.ఇక చివరగా ముగింపు.. ఎంతో చాకచక్యంతో.. హృదయాన్ని హత్తుకునేలా తీశారు. ఇక తండ్రీ కూతురు మధ్య వచ్చే సన్నివేశం అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు.ఏ లవ్‌స్టోరీ మూవీకైనా.. సాధారణంగా ముగింపు ఇలానే ఉండొచ్చు అని ముందే ఊహించుకోవచ్చు.అయితే మూవీ ఎండింగ్‌ మాత్రం.. ఎవరూ ఊహించనివిధంగా మలిచి..డైరెక్టర్‌ బుచ్చిబాబు సఫలీకృతమయ్యారనే చెప్పుకోవచ్చు. అలాగే దేవీశ్రీప్రసాద్‌ సంగీతం కూడా హైలెట్‌గా నిలిచింది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com