'జాతిరత్నాలు' టీజర్ విడుదల
- February 12, 2021
హైదరాబాద్:'జాతిరత్నాలు' అనే పదానికి కొత్త అర్థం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు 'మహానటి' ఫేమ్ నాగ అశ్విన్. ఆయన నిర్మాణంలో అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శివరాత్రి కానుకగా జనం ముందుకు రాబోతోంది. ఇప్పటికే కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ రామకృష్ణ. ఇక 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో హీరోగా తెలుగువారికి చేరువైపోయాడు నవీన్ పోలిశెట్టి. అలానే కామెడీ పాత్రలతోనే కాకుండా, 'మల్లేశం' వంటి సినిమాతో నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు ప్రియదర్శి పులికొండ. వీళ్లు ముగ్గురూ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమానే 'జాతిరత్నాలు'. స్వప్న సినిమా బ్యానర్ లో అనుదీప్ కేవీ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. 65 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం వినోదాల విందు పంచుతూనే ఉంది. ఫుల్ లెంగ్త్ కామెడీ డ్రామా 'జాతిరత్నాలు'లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. శుక్రవారం నుండి 'ఉప్పెన' విడుదలైన అన్ని థియేటర్లలోనూ 'జాతిరత్నాలు' టీజర్ ను ప్రదర్శించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఇద్దరు ఆడే చెస్ గేమ్ ను ఇందులో హీరోలు నవీన్, ప్రియదర్శి, రామకృష్ణ కలిసి ఆడుతుంటారు. ఇప్పటికే ఇలాంటి కామెడీ కాన్సెప్ట్ తో జనంలో ఆసక్తిని రేకెత్తించిన నాగ అశ్విన్... ఈ మూవీని శివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ చేయబోతున్నాడు. మరి ఒకరికి ముగ్గురు కలిసి పంచే వినోదాల విందు ఎలా ఉంటుందో చూడాలి.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







