అరకు లోయ బస్సు ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే!

- February 13, 2021 , by Maagulf
అరకు లోయ బస్సు ప్రమాదానికి కారణం మానవ తప్పిదమే!

అరకు:అరకు అందాలను, ఆ అనుభవాలను మోసుకెళ్లాల్సి వాళ్లు.. తమతో వచ్చిన వారి మృతదేహాలను మోసుకెళ్లాల్సిన పరిస్థితి. క్షణకాలంలో జరిగిన ఘోర ప్రమాదంతో ఆప్తులను కోల్పోయారు. ఒక్కొక్కరి ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి. కూతుర్ని చూపిస్తేనే గాయాలకు మందు వేయించుకుంటానంటూ ఓ తల్లి రోదన. మా పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి.. ఒక్కసారి చూపించండయ్యా అంటూ ఆ తల్లులు ఏడుస్తుంటే మిగిలిన వాళ్లంతా కంట తడి పెట్టుకున్నారు. హైదరాబాద్‌ షేక్‌పేట్‌కు చెందిన ఆర్‌బీఐ ఉద్యోగి వారి దగ్గరి బంధువులు మొత్తం 26 మంది టూర్‌కు బయల్దేరారు. విజయవాడ, అమరావతి, మంగళగిరి సందర్శించి అన్నవరం దేవస్థానానికి వెళ్లారు. అక్కడినుంచి సింహాచలం వెళ్లి మన్యంలోని లంబసింగి, పాడేరు, అరకు, బొర్రా గుహలను సందర్శించారు. ఏజెన్సీ అందాలను తిలకించిన తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి ఏడున్నర ప్రాంతంలో వీరి బస్సు ఘాట్‌ రోడ్డులో అనంతగిరి మండలం డముకు సమీపంలోకి చేరుకుంది. అక్కడే అతి ప్రమాదకరమైన ఐదో నంబర్ మలుపు వద్ద అదుపుతప్పి కన్నుమూసి తెరిచేలోగా 100 అడుగుల లోయలోకి దూసుకుపోయి బోల్తా పడింది.

అరకులోయ ఘాట్‌రోడ్‌లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్‌ పిన్‌ బెండ్‌లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి. ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ప్రమాదానికి గురైన టూరిస్ట్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ట్రావెల్స్ యజమానులతో పాటు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదానికి కారణమైంది. దినేష్ ట్రావెల్స్ కు చెందిన ఈ మిని బస్సు అస్సలు కండిషన్ లో లేనట్టు అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com