ఎట్టకేలకు సుల్తానేట్లోకి ఒంటెల రవాణాకు అనుమతించిన ఒమన్
- February 13, 2021
మస్కట్:సుల్తానేట్ సరిహద్దుల అవతల చిక్కుకుపోయిన ఒంటెలను దేశంలోకి అనుమతించేందుకు ఎట్టకేలకు ఒమన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రటకన విడుదల చేసింది. దీంతో చాన్నాళ్లుగా సరిహద్దు అవతలే ఉండిపోయిన ఒంటెలను ఎట్టకేలకు ఒమన్లోకి తీసుకొచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. అంతేకాదు..ఒంటెల ఓనర్లకు, ఒంటెలను రవాణా చేసే క్యారియర్లపై విధించే అన్ని జరిమానాల నుంచి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది వచ్చే మార్చి వరకు మినహాయింపు కాలంగా స్పష్టం చేసింది. ఇన్నాళ్లు వైరస్ మహమ్మారి భయంతో దేశంలోకి అనుమతులపై ఆంక్షలు విధించటంతో చాలా వరకు ఒంటెలు, ఒంటెల రవాణా చేసే క్యారియర్లు సరిహద్దులోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే..ఇప్పుడు ఒంటెలను దేశంలోకి అనుమతిస్తున్నా...వాటిని ఏ కారణం చేత సరిహద్దు దాటించారనేది స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫామ్ ను సమర్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







