సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రముఖుల ట్వీట్స్
- February 17, 2021
హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు..మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోదీ ట్వీట్ చేయగా..మీరు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని గవర్నర్ తమిళిసై తెలిపారు.వీరితో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మెగాస్టార్ చిరంజీవి పలువురు ప్రముఖులు కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

అటు కేసీఆర్ పుట్టినరోజున కోటి వృక్షార్చనకు టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది.అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. ఇక హైదరాబాద్ జలవిహార్‌లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రస్థానంపై త్రీడీ గ్రాఫిక్స్‌తో 30 నిమిషాల డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు. మరోవైపు కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో రుద్రహోమం కొనసాగుతోంది. ఇటు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆకృతిలో పూలమొక్కల్ని పేర్చి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పారు. ఇక్కడే కాకుండా 50 దేశాల్లో కేసీఆర్ పుట్టినరోజు వేడుకులు చేయనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్‌లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్‌తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







