అజ్మీర్ దర్గాకు చాదర్ సాగనంపిన కేసీఆర్
- February 19, 2021
హైదరాబాద్:అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్) ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం సాగనంపారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాదర్ ను ముస్లిం మత పెద్దలు కేసీఆర్ ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయ రంగం పురోగమించాలని, కేసీఆర్ కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితం గడపాలని ప్రార్థించారు. ఆజ్మీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ముస్లింలకు సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఎంఎల్సీలు మహ్మద్ ఫరీదుద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, టిఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్, ముఫ్తి సయ్యద్ యూసఫ్, కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







