పర్సనల్ గా ఇంపోర్ట్ చేసుకునే బుక్స్ కు పర్మిషన్ అక్కర్లేదు...
- February 19, 2021
ఒమన్:వ్యక్తిగత అవసరాలు, సొంత వినియోగానికి విదేశాల నుంచి తెప్పించుకునే పుస్తకాలకు ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదని ఒమన్ సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..పబ్లికేషన్, డిస్ట్రిబ్యూషన్ కోసం ఇంపోర్ట్ చేసుకునే పుస్తకాలకు మాత్రం మంత్రిత్వ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని కూడా క్లారిటీ ఇచ్చింది. సుల్తానేట్లోని కొన్ని షిప్పింగ్ కంపెనీలు కొన్ని తమ వినియోగదారులకు చేస్తున్న సూచనలు ఇంపోర్టెడ్ బుక్స్ పై గందరగోళాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బుక్స్, మెడిసిన్, మొబైల్ డివైజ్లు షిప్మేట్ చేసుకునే వినియోగదారులు కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఎందుకంటే వాటి రవాణాకు మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అంటూ షిప్పింగ్ కంపెనీలు వినియోగదారులకు మెయిల్ చేశాయి. దీంతో బుక్స్ ఇంపోర్ట్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవ్వటంతో స్పందించిన మంత్రిత్వ శాఖ సొంత వినియోగానికి ఇంపోర్ట్ చేసుకునే బుక్స్ కు ఎలాంటి అనుమతులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







