కువైట్: జనం గుమికూడరాదు, కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే

- February 19, 2021 , by Maagulf
కువైట్: జనం గుమికూడరాదు, కోవిడ్ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించాల్సిందే

కువైట్: జనం ఎట్టిపరిస్థితుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా గుమికూడరాదనీ, కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు సూచించబడిన అన్ని నిబంధనల్నీ పాటించాల్సిందేనని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పునరుద్ఘాటించింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలు అలాగే, హెల్త్ అథారిటీస్ చేస్తోన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత బాధ్యతగా వ్యవహరించాలని మినిస్ట్రీ ఇంటీరియర్ స్పష్టం చేసింది. బ్రిగేడియర్ తవహీద్ అల్ కాందారి మాట్లాడుతూ, లా నెంబర్ 8, 1969 మరింత పక్కగా అమలు చేయబడుతుందని చెప్పారు. ఎక్కడైనా ఎక్కువమంది గుమికూడినట్లయితే, అలాంటి సమాచారాన్ని ఎమర్జన్సీ ఫోన్ నెంబర్ 112కి తెలపాలంటూ విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com