బాహుబలిని 42వ సాటర్న్ అవార్డ్స్ పోటీకి ఎంపిక
- February 27, 2016
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన భారీ జానపద చిత్రం బాహుబలి రిలీజ్ అయి పది నెలలు కావస్తున్నా.. ఈ సినిమా హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికల మీద సత్తా చాటిన ఈ గ్రాఫికల్ వండర్ ఇప్పుడు సాటర్న్ అవార్డ్స్ లోనూ పోటీ పడుతోంది. అంతేకాదు ఈ వేడుకలోదాదాపు ఐదు కేటగిరీల్లో బాహుబలి పోటీ పడటం విశేషం.ద ఎకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హర్రర్ ఫిలింస్ సంస్థ, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలిని 42వ సాటర్న్ అవార్డ్స్ పోటీకి ఎంపికచేసింది. బెస్ట్ ఫాంటసీ ఫిలిం, బెస్ట్ ఫిలిం మ్యూజిక్ (కీరవాణి), బెస్ట్ ఫిలిం ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్ (తమన్నా), బెస్ట్ ఫిలిం కాస్ట్యూమ్ డిజైన్ (రమా రాజమౌళి, ప్రశాంతి తిపిర్నేని) కేటగిరీల్లో బాహుబలి పోటీ పడుతోంది.ఈ ఏడాది జూన్ లో ఈ అవార్డ్ ఫంక్షన్ జరగనుంది.ఆర్కా మీడియా బ్యానర్ పై దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, ఈ ఘనత సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బాహుబలి 2ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







