చిరంజీవి సెంటిమెంట్ ను నమ్ముకుని 'బ్రహ్మోత్సవం..
- February 27, 2016
మహేష్ తన 'బ్రహ్మోత్సవం' షూటింగ్ వేగాన్ని పెంచాడు. రకరకాల కారణాలతో ఇప్పటి వరకు నెమ్మదిగా నడిచిన 'బ్రహ్మోత్సవం' షూటింగ్ పూర్తిగా స్పీడ్ అందుకుంది. సమంత కూడ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కావడంతో మహేష్ సమంతల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా మహేష్ సమంతల పై వచ్చే సోమవారం నుండి ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వారణాసిలో శ్రీకాంత్ అడ్డాల చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఈ సన్నివేసాలు ఈ సినిమా కథకు సంబంధించి చాల కీలకం కావడంతో బ్యాక్ డ్రాప్ గా వారణాసి వాతావరణం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలతో ఈ యూనిట్ అంత దూరం వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈమధ్యనే సమంతతో కలిసి రామోజీ ఫిలిం సిటీలో ఒక పూజా సీన్ కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొన్న మహేష్ ఇప్పుడు తన కార్యస్థానాన్ని వారణాసికి మారుస్తున్నాడు.'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో భద్రాచలం రాములవారి కళ్యాణం సీన్స్ ఎలా కీలకంగా మారాయో 'బ్రహ్మోత్సవo' కు వారణాసిలో చిత్రీకరించబోయే సన్నివేశాలు అత్యంత కీలకం కాబోతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఒక విచిత్రమైన సెంటిమెంట్ 'బ్రహ్మోత్సవం' యూనిట్ ను వారణాసి వైపు పరుగులు తీయిస్తోంది అని టాక్. వారణాసిలో షూటింగ్ జరుపుకున్న టాప్ హీరోల సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ గా మారాయి. చిరంజీవి 'ఇంద్ర' అల్లుఅర్జున్ 'గంగోత్రి' పవన్ 'గోపాల గోపాల' సినిమాలు అన్నీ వారణాసిలో చిత్రీకరణ జరుపుకున్న నేపధ్యం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టాలి అన్న ధ్యేయంతో చిరంజీవి సెంటిమెంట్ ను నమ్ముకుని 'బ్రహ్మోత్సవం' వారణాసి బాట పట్టింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏప్రియల్ లో వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ తో తిరుపతిలో ఆడియోను విడుదల చేసి తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సెంటిమెంట్ తో మే 31న విడుదల కాబోతున్న ఈ 'బ్రహోత్సవం' చాల సెంటిమెంట్లతో నిండిపోయింది..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







